Share News

Shamshabad Airport: ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుంది.. గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:38 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో హెచ్చరించారు.

Shamshabad Airport: ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుంది.. గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్
Shamshabad Airport

హైదరాబాద్, నవంబర్ 18: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరచూ బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. బాంబు ఉన్నట్లు మెయిల్ రావడంతో విమానాశ్రయ సిబ్బంది అలర్ట్ అయి తనిఖీలు చేయడం.. ఆ తరువాత అవి ఫేక్ అని తేలడం జరుగుతూనే ఉంది. అయితే ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వార్తలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పడు తాజాగా మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.


ఈరోజు (మంగళవారం) ఉదయం 10:05 గంటలకు ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లుగా మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో హెచ్చరించారు. కసబ్‌ను మైనర్‌గా విచారణ చేయకుండానే ఉరి తీశారని మెయిల్‌లో రాశారు. ఈరోజు ఆపరేషన్ కోసం లాజిస్టిక్స్ సిద్ధం చేయడానికి 3 నెలలు పట్టిందని మెయిల్ సారాంశం.


హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో ఉన్న ముస్లింలు, మహిళలు, పిల్లలను ఖాళీ చేయాలని కోరుతూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్టులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా విమానాశ్రయ సిబ్బంది ఆరా తీసే పనిలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 03:11 PM