Share News

Minister Seethakka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:17 PM

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలన్నారు.

Minister Seethakka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
Minister Seethakka

హైదరాబాద్, నవంబర్ 20: ఇందిరమ్మ చీర‌ల పంపిణిపై అధికారుల‌కు మంత్రి సీత‌క్క (Minister Seethakka) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి ఇందిరమ్మ చీర పంపిణీ చేయాలని.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చీరలు పంచాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి చీరలు అందజేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీ వెలుపల ఉన్న మహిళలకు వెంటనే సభ్యత్వం వెను వెంటనే చీర పంపిణీ చేయాలని మంత్రి తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతపై నియోజకవర్గ, మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.


పంపిణీ వివరాలు తప్పనిసరిగా ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ క్రమశిక్షణగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీర అందాలన్నారు. కొత్త లబ్ధిదారుల గుర్తింపుకు పౌర సరఫరా శాఖ సహకారం తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.


కాగా.. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన మహిళలకు రెండు దశల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిన్నటి (బుధవారం) నుంచి ఈ కార్యక్రమం మొదలవగా.. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం (డిసెంబర్ 9) మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేస్తారు. ఇక రెండవ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చి 8 వరకు పట్టణాల్లో చీరలను పంచనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ప్రతీ మహిళకు బొట్ట పెట్టి చీరలు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. చీరలు తీసుకునేందుకు లబ్ధిదారులు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. అలాగే చీరలు తీసుకున్నాక ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ ద్వారా రికార్డు చేయాలి. సెర్ప్ సభ్యులు ముఖ గుర్తింపు యాప్ ద్వారా వారి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేసి, లబ్ధిదారుల ఫొటోను తీసి చీర అందజేస్తారు.


ఇవి కూడా చదవండి..

లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...

రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2025 | 01:59 PM