Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:00 PM
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ ట్రాఫ్ (Maoist trap)లో భద్రతా బలగాలు (security forces) పడినట్లు తెలుస్తోంది. కర్రె గుట్టల చుట్టూ ఐ.ఈ.డీ (IED)లు ఏర్పాటు చేశామంటూ రెండు వారాల క్రితం మావోయిస్టులు లేఖ (letter) విడుదల చేశారు. ఈ క్రమంలో కర్రె గుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. గత తొమ్మిది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అయినా మావోయిస్టుల ఆచూకీ లభ్యం కాలేదు... ఎట్టకేలకు బంకర్‌ను గుర్తించారు. భద్రతా బలగాల రాక పసిగట్టిన మావోయిస్టులు మకాం మార్చారు. కర్రెగుట్టల్లో పదుల సంఖ్యలో గుహలు ఉన్నాయి. దీంతో భద్రతా బలగాలకు సెర్చ్ ఆపరేషన్ సవాల్‌గా మారింది. కర్రె గుట్టల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో పామెడు వైపు మూడు బ్యాచ్‌లు.. దంతెవాడ వైపు రెండు బ్యాచ్‌లు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా కర్రె గుట్టలోనే ఉన్నాడనేసెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read: వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా
కాగా కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి కర్రెగుట్టల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం.
కర్రెగుట్టలు దట్టమైన అటవీ ప్రాంతం. సాయంత్రం నాలుగైందంటే చాలు.. ఐదు అడుగుల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించనంత చీకటి అలుముకుంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ సురక్షిత స్థావరంగా భావిస్తారు. అందులోనూ ఆ ప్రాంతం వారికి కొట్టినపిండి. కానీ.. బలగాలకు మొత్తం కొత్తే కావడంతో ఇక్కడ ఆపరేషన్ నిర్వహించడం పెను సవాళ్లుగా మారింది.
కాగా భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నక్సలైట్లు ఆహారం, మంచి నీటి కోసం వెంపర్లాడుతున్నట్లు తెలుస్తోంది. నక్సలైట్లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి సుమారు 4 నెలల పాటు రేషన్‌తో కర్రెగుట్ట కొండలలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో.. ఆ రేషన్ కూడా వారికి ఉపయోగపడలేదు.. కొండలపై నుంచి దిగితే సైనికుల తూటాలకు బలి అవుతారనీ, భయంతో కొండలపైనే ఎక్కువ కాలం దాక్కుని ఉంటే డీహైడ్రేషన్ వల్ల చనిపోతామనే భయం వారిని వెంటాడుతుంది. మరోవైపు, నక్సలైట్లు దాక్కున్న కొండలను మొత్తం స్వాధీనం చేసుకునే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని భద్రతా దళాలు పట్టుదలతో ఉన్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు చొరవ చూపాలంటూ ఇటీవల మావోయిస్టులు ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ హయాంలో జరిగిన పాపాలు బయటకు..
ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభ వార్త..
గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
For More AP News and Telugu News