Share News

Hyderabad Rains: భారీ వర్షం.. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:27 PM

భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లోని రాయదుర్గం, షేక్ పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో భారీ వర్షాలు కొనసాగే పరిస్థితుల నేపథ్యంలో నగరవాసులకు..

Hyderabad Rains: భారీ వర్షం.. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..
Hyderabad Rain

హైదరాబాద్, జులై 18: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఇలాంటి వేళ నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఇక, హైదరాబాద్‌లో మరో గంటపాటు భారీ వర్షం పడే అవకాశం ఉంది. షేక్ పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీ వర్షం కారణంగా జనం అవస్థలు పడుతున్నారు. కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ లో భారీ వర్షం పడింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో ఫుల్ ట్రాఫిక్ కనిపిస్తోంది. రాయదుర్గం, షేక్ పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఐటీ కారిడార్ ఉంది. కొన్ని రోడ్లు నాలాలను తలపిస్తున్నాయి. రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి పిజేఆర్ ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏఎంబీ మాల్ ముందు వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది.


హైటెక్ సిటీ, కెపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఉంది. ఐటీ కారిడార్ రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. టోలిచౌకి, మెహదీపట్నం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటరు ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతోంది. టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లుతోంది. వరద ప్రవాహానికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్రేటర్ లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


మరో రెండు గంటలపాటు నగరవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని సమాచారం అందుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అటు, సంగారెడ్డి జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, పఠాన్ చెరు, ఆర్సీ పురం, జిన్నారం, సదాశివపేట మండలంలో భారీగా వర్షం కురుస్తోంది.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 06:10 PM