Share News

SIT Interrogation: నాలుగోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు

ABN , Publish Date - Jun 19 , 2025 | 02:02 PM

SIT Interrogation: నాలుగో సారి విచారణలో భాగంగా వ్యక్తిగతంగా చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 2023, నవంబర్ 15న ఏకంగా 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి.

SIT Interrogation: నాలుగోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు
SIT Interrogation

హైదరాబాద్, జూన్ 19: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. నాలుగోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లు ట్యాప్‌‌పై ప్రభాకర్ రావును సిట్ ఆఫీసర్లు విచారిస్తున్నారు. ఈరోజు జరిగే విచారణ చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగిందనే దానిపై ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్లపై సుదీర్ఘంగా మూడు సార్లు విచారణ జరిపి ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు సిట్ అధికారులు.


ఈరోజు నాలుగో సారి విచారణలో భాగంగా వ్యక్తిగతంగా చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 2023, నవంబర్ 15న ఏకంగా 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వీరి ఫోన్ ట్యాప్‌కు సంబంధించి కచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నడిచిందని గుర్తించిన సిట్.. దీనిపై ప్రభాకర్‌ రావును ప్రశ్నిస్తున్నారు.


మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో రాజకీయ నేతలు ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. టెలికాం సర్వీస్ నుంచి సిట్ బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. పదవీ విరమణ పొందిన తరువాత ప్రభాకర్ రావు ఓఎస్డీగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ లీగల్ ఇంటర్ సెప్షన్‌కు డిజిగ్నెటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ విచారణ చేస్తోంది. డిజిగ్నెటెడ్ అథారిటీ హోదాలో 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్‌లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. అయితే చట్ట విరుద్ధంగా గడువు ముగిసినా ఫోన్స్‌పై నిఘా, ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏడు రోజులు తరువాత ఫోన్స్‌పై నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ బృందం గుర్తించింది.


ఇవి కూడా చదవండి

బనకచర్ల వివాదం.. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్

ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్

అంబటిపై కేసు.. ఎందుకంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:29 PM