Share News

Padi Kaushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Apr 24 , 2025 | 03:33 PM

Padi Kaushik Reddy: సుబేదారి పోలీస్‌స్టేషన్‌‌లో నమోదైన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Padi Kaushik Reddy: పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్
Padi Kaushik Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 24: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (BRS MLA Padi Kaushik Reddy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. సుబేదారి పోలీస్‌స్టేషన్‌‌లో నమోదైన కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగించవచ్చని, పోలీసులకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. క్వారీ యజమాని మనోజ్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడంటూ పాడి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.


మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును కొట్టివేయాలంటూ కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పిటిషన్‌పై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోర్టులో వాదించారు. 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉన్నాయని తెలిపారు.

PM Modi Pahalgam Attack Response: కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక


కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ 2023 అక్టోబర్‌ 25న 25లక్షల రూపాయలు కౌశిక్‌ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని పీపీని హైకోర్టు ప్రశ్నించింది. అయితే బెదిరించడంతోనే రూ.25 లక్షలను కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించాడని పీపీ వెల్లడించారు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పీపీ పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని ప్రశ్నించిన న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే తదుపరి విచారణ వరకు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది ధర్మాసనం. తదుపరి విచారణను ఈనెల 28 వరకు హైకోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 03:36 PM