Share News

OMC Case: ఓఎంసీ కేసు.. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్

ABN , Publish Date - May 19 , 2025 | 04:36 PM

OMC Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు నిందితులు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

OMC Case: ఓఎంసీ కేసు.. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్
OMC Case

హైదరాబాద్, మే 19: ఓబులాపురం మైనింగ్ కేసులో (Obulapuram mining case) నిందితులు తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ కోర్టు (CBI Court) ఇచ్చిన తీర్పను హైకోర్టులో సవాల్ చేశారు నిందితులు. ఇప్పటికే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి (Gali Janardan Reddy) సీబీఐ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు హైకోర్టును కోరారు. నిందితులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై ఈ నెల 21న హైకోర్టు విచారించనుంది


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఇటీవల సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఓఎంసీ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చుతూ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఏ1 శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏ2 మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీ.డీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీ ఖాన్‌లకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. వీరందరికీ ఏడేళ్ల పాటు శిక్షను విధించింది న్యాయస్థానం. అలాగే ఓఎంసీ కేసులో మాజీ మంత్రి సబిత, ఐఏఎస్ కృపానందలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా తేల్చింది న్యాయస్థానం.


కాగా.. ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009, డిసెంబర్ 7న కేసు నమోదు చేసిన సీబీఐ.. 2011లో మొదటి ఛార్జ్‌షీట్‌‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి)కింద సీబీఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను సీబీఐ విచారించింది. అలాగే డాక్యమెంట్ ఎవిడేషన్ కింద 3337 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారికి ఏడేళ్ల పాటు శిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.


ఇవి కూడా చదవండి

Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 04:51 PM