Share News

New Year Celebration Permission: న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? పర్మిషన్ ఉండాల్సిందే..

ABN , Publish Date - Dec 01 , 2025 | 07:59 PM

న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.

New Year Celebration Permission: న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? పర్మిషన్ ఉండాల్సిందే..
New Year 2026 Celebration Permission

హైదరాబాద్: న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్స్.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అందరూ ఫుల్​గా ఎంజాయ్ చేయాలనుకుంటారు. డిసెంబర్ 31వ తేదిన సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సంబరాలు చేసుకుంటారు. రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తారు. డీజే సౌండ్స్​ పెట్టుకుని సందడి చేస్తారు. అంతేకాకుండా, పలువురు మద్యం తాగుతూ చిందులు వేస్తారు. అలాగే, కేక్​లను కట్​ చేస్తూ న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. అయితే, మీరు కూడా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.


న్యూ ఇయర్ వేడుకలకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. న్యూ ఇయర్ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అంటున్నారు. 21-12-2025 లోపు మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. cybpms.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. టికెట్ ఈవెంట్లకు కమర్షియల్/టికెటెడ్ ఫారం ఎంపిక ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోమని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News

Updated Date - Dec 01 , 2025 | 08:32 PM