Naveen Yadav: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:52 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ చేత ప్రమాణం చేయించారు.
హైదరాబాద్, నవంబర్ 26: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ (MLA Naveen Yadav) ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (బుధవారం) నవీన్ యాదవ్‌తో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) ప్రమాణం చేయించారు. స్పీకర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎమ్మెల్యే గణేష్, కాంగ్రెస్ నేతలు, నవీన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
కాగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేశారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగగా.. నవంబర్ 14న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలు.. ప్రతి రౌండ్‌లోనూ నవీన్ తన ఆధిక్యతను కొనసాగించారు. చివరకు జూబ్లీహిల్స్ బైపోల్‌లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలువగా.. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.
ఇవి కూడా చదవండి...
శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
హైదరాబాద్‌లో సఫ్రాన్ కొత్త సెంటర్.. తెలంగాణ వృద్ధికి మైలురాయన్న సీఎం
Read Latest Telangana News And Telugu News