Share News

MP Eatala Rajender: కొంపల్లి ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ సీరియస్

ABN , Publish Date - Nov 17 , 2025 | 02:17 PM

కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని వారు టెండర్లు ఎందుకు తీసుకున్నారంటూ కాంట్రాక్టర్లపై విరుచుకుపడ్డారు.

MP Eatala Rajender: కొంపల్లి ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ సీరియస్
MP Eatala Rajender

హైదరాబాద్, నవంబర్ 17: నగరంలోని కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్స్, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలానే చేస్తే ప్రజల చేతుల్లో దెబ్బలు తప్పవంటూ హెచ్చరించారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై ఈటల దృష్టిసారించారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలని కొత్త ఫ్లై ఓవర్స్ మంజూరు చేయాలని నిన్న కేంద్రమంత్రి గడ్గరీని కలిసిన ఈటల.. ఈరోజు (సోమవారం) కొంపల్లి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.


అయితే ఫ్లైఓవర్ పనుల్లో ఆలస్యంపై అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 2022 ఏప్రిల్‌లో ఫ్లై ఓవర్ పనులు మొదలయ్యాయని.. మూడేళ్లు పూర్తయినా పనులు మాత్రం అవ్వలేదని ఆగ్రహించారు. ఫ్లై ఓవర్ ఆలస్యం వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని.. వందల మందికి గాయాలు అయ్యాయని ధ్వజమెత్తారు. నిర్మాణం చేస్తామని.. మంచి చేస్తామని వచ్చిన కాంట్రాక్టర్లు ఆలస్యం చేసి ప్రజల ఉసురు తీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వీరికి ఏం పనిష్మెంట్ ఇచ్చినా తప్పులేదని... చేతకాని వారు టెండర్ ఎందుకు వెయ్యాలని.. అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అసలు కాంట్రాక్టర్లకు ఉన్న సమస్య ఏంటి అంటూ ఈటల ప్రశ్నించారు.


ఉప్పల్ ఫ్లైఓవర్ కి ఆరేళ్లు.. ఈ ఫ్లైఓవర్ కి మూడేళ్లు గడిచిపోయాయని.. ఆలస్యంతో ప్రాణాలు పోతున్నాయని చెప్పుకొచ్చారు. రెండేళ్లు అంటే 2024 ఏప్రిలో పూర్తి కావాలని కానీ.. ఇంకా కాలేదంటూ ఆగ్రహించారు. సంవత్సరంగా వాళ్ల కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ స్పందించకపోతే దెబ్బలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వాళ్లను జైల్లో పెట్టించాలన్నారు. మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు. పక్కన ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నా పూడ్చి వాహనాలు వేగంగా వెళ్లేలా చూడాలి కదా.. అధికారులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. షాపులలో రెండు ఇంచుల దుమ్ము పడుతోందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రజల చేతుల్లో దెబ్బలు తప్పవని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

సౌదీ ప్రమాదం... రెండు కుటుంబాల్లోని వారంతా

పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 05:23 PM