Share News

Komatireddy On HAM Roads : హ్యామ్ రోడ్లు.. త్వరలోనే టెండర్లకు పిలుపు: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:17 PM

HAM Roads Komatireddy: గత ప్రభుత్వం 42 బ్రిడ్జ్‌లను అప్రూవల్ లేక వదిలేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్ అండ్ బీలో ఎలాంటి వివాదాలు లేకుండా పోస్టింగ్స్, ప్రమోషన్స్ ఇచ్చామని.. గత ప్రభుత్వం కనీసం ఏఈలను కూడా రిక్రూట్ చేయలేదని విమర్శించారు.

Komatireddy On HAM Roads : హ్యామ్ రోడ్లు.. త్వరలోనే టెండర్లకు పిలుపు: మంత్రి కోమటిరెడ్డి
HAM Roads Komatireddy

హైదరాబాద్, జులై 3: హ్యామ్ రోడ్లను ఫైనల్ చేశామని.. త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. ఈరోజు (గురువారం) ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్ బీ కార్యాలయంలో హ్యామ్ రోడ్ల ప్యాకేజీపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) చర్చించి ఆగస్టు నెలాఖరు వరకు అగ్రిమెంట్ పూర్తి చేస్తామన్నారు. సెప్టెంబర్‌లో పనులు మొదలు పెడతామని వెల్లడించారు. హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లో హ్యామ్ మోడలల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి చెప్పారు.


గత ప్రభుత్వం 42 బ్రిడ్జ్‌లను అప్రూవల్ లేక వదిలేసిందన్నారు. ఆర్ అండ్ బీలో ఎలాంటి వివాదాలు లేకుండా పోస్టింగ్స్, ప్రమోషన్స్ ఇచ్చామని.. గత ప్రభుత్వం కనీసం ఏఈలను కూడా రిక్రూట్ చేయలేదని విమర్శించారు. రోడ్లు వేసేది ప్రజల కోసమని.. తమకు పేరు కోసం కాదన్నారు. మూడున్నరేళ్లలో ఆర్‌అండ్‌బీ ద్వారా 12 వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేస్తామని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉందన్నారు.


కేంద్ర మంత్రి గడ్కరీ ఆన్ గోయింగ్ పనులకు రూ.300 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ నెలలో గడ్కరీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని.. ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులు తెచ్చుకుంటామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కేసీఆర్ ఆర్ అండ్ బీని వదిలేశారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు,ఈఎన్సీటీ జయ భారతి, సీఈలు మోహన్ నాయక్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి పలువురు ఎస్‌ఈలు, ఈ.ఈ, ఏ.ఈ తదితరులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి

సిగాచి దుర్ఘటన.. ఇంటర్వ్యూకు వచ్చిన యువతి అదృశ్యం

ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 04:52 PM