Ahilyabai Holkar: సుపరిపాలనకు ప్రతిరూపం అహల్యాబాయి హోల్కర్
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:25 PM
అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయగా ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవ వేడుకలు మార్చి8వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 300 కార్యక్రమాల్లో అహల్యాబాయి జీవిత గాథను తెలిపే 3వేల పుస్తకాల విద్యార్థులకు అందజేయడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 30వేల మంది అధ్యాపకులు..

మరాఠా వీరనారి, ఇండోర్ మహారాణి దేవీ అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ధి జయంతి వేడుకల ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ABRSM) ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 300 గంటల పాటు మూడు వందల విద్యాసంస్థల్లో అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయగా ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవ వేడుకలు మార్చి8వ తేదీతో ముగిశాయి.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 300 కార్యక్రమాల్లో అహల్యాబాయి జీవిత గాథను తెలిపే 3వేల పుస్తకాల విద్యార్థులకు అందజేయడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 30వేల మంది అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని ఆమె జీవన గాథను విద్యార్థులకు వివరించారు. ఈ పది రోజులలో నిర్వహించిన కార్యక్రమాల చిత్ర మాలికతో కూడిన సావనీర్ ను ముగింపు వేడుకల సందర్భంగా అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదట అతిథులు అహల్యాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సయ్యద్ హసన్, ఐఐటి హైదరాబాద్ సంచాలకులు ఆచార్య బిఎస్ మూర్తి, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కొమరయ్య, రాష్ట్రీయ సేవికా సమితి ప్రముఖ కార్యవాహిక సీతక్క, పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్, హ్యాపీ నేచురల్ మోటివేషనల్ స్పీకర్ కవిత, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ జాయింట్ ఆర్గనైజేసింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సుపరిపాలనకు ప్రతిరూపంగా
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అతిథులు రాణి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను వివరించారు. దేశ చరిత్రలో సుపరిపాలనకు ప్రతిరూపంగా నిలిచిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ అని అతిథులు పేర్కొన్నారు. ఆమె తన అద్భుతమైన కృషి ద్వారా వివిధ విభాగాలలో శాశ్వత ముద్ర వేశారన్నారు. 1725 మే 31న మహారాష్ట్రలోని అహల్యా నగర్ జిల్లాలోని చౌండి గ్రామంలోని ఒక పాస్టోరల్ సామాజిక వర్గంలో జన్మించిన అహల్యాబాయుకు విద్య, మహిళా సాధికారత, రాచరికం వంటి అంశాలతో సంబంధం లేకపోయినా.. ఆమె అంతర్గతంగా తెలివైనది, చురుకైనదని పేర్కొన్నారు. ఇండోర్ సంస్థానాధీశులు మల్హరావు హోల్కర్ ఆమె ధీర లక్షణాలను గమనించి అహల్యాబాయిని తన కుమారుడు ఖండేరావుతో వివాహం జరిపించారని తెలపారు. ఆమె 12 సంవత్సరాల చిన్న వయస్సులోనే ఒక రాజ కుటుంబంలోకి ప్రవేశించటంద్వారా.. మామ మల్హరావు, అత్త గౌతమబాయి నుండి రాజకీయాలు, సూపరిపాలన గురించి నేర్చుకోవడం ప్రారంభించి.. కొద్ది కాలంలోనే ఆమె తన ప్రజల అవసరాలను అర్థం చూసుకోగలిగిందని తెలిపారు. ఆమె కుటుంబ విషయాలతో పాటు రాజకీయ పరిపాలనపై శ్రద్ధ చూపడం ప్రారంభించిందని అన్నారు.
మూడు దశాబ్దాల పాలన..
మల్హరావు మరణం తర్వాత 1764 నుంచి 1795 వరకు ఇండోర్ ను దాదాపు మూడు దశాబ్దాలు నిరాఘాటంగా అహల్యాబాయి పరిపాలించారి అతిథులు గుర్తుచేసుకున్నారు. ఇండోర్‌ను ఒక సంపన్న రాజ్యంగా ప్రసిద్ధి చేశారని తెలిపారు. అసంఖ్యాకమైన మహిళా సైనిక శక్తిని ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. సామాన్యుల పట్ల గొప్ప మాతృ వాత్సల్యం, సమానత్వం కలిగి ఉండేవారన్నారు. అనేక దేవాలయాలు, నదీ ఘాట్లు, బావులు, తాగునీటి సౌకర్యాలు, ప్రయాణికులకు వసతి, ఆహార, ధార్మిక సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు ఆమె నిస్వార్థ, న్యాయమైన పాలాన అందించారని తెలిపారు. తన రాజ్యంలో పోడు భూములను సాగులోకి తెచ్చారని, 9-11 చట్టం ద్వారా రైతు సంక్షేమం కోసం కృషి చేశారని అన్నారు. ఉద్యానవన సాగును ప్రోత్సహించారని అన్నారు. నర్మదా నదిలో కాలుష్యాన్ని నివారించి సహజత్వాన్ని కాపాడారని గుర్తుచేసుకున్నారు. మహిళలకు జీవనోపాధి పొందే మార్గాలను అందించారని కార్యక్రమంలో పాల్గొన్న అతిధులుపేర్కొన్నారు. తన సైన్యంలో మహిళా బెటాలియన్‌ను సృష్టించారని తెలిపారు. ఒక సందర్భంలో తన కుటుంబంలోని సభ్యలంతా మరణింంచినా ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకొని తన రాజ్యమే తన కుటుంబంగా భావించి పాలన చేశారని అన్నారు. అలాంటి రాణి అహల్యాబాయి హోల్కర్ స్వయం వ్యక్తిత్వం, శక్తియుక్తులు, కార్యసాధన వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని అతిథులు ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here