Hyderabad CCTV Maintenance: హైదరాబాద్‌లో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు.. ప్రారంభించిన సీపీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:25 PM
సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్ అంటూ నామకరణం చేసిన ఈ బృందాలను సీపీ సజ్జనార్ ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబర్ 27: నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఎక్కడైన హత్య, దొంగతనం జరిగినా ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు దొంగలను ఈజీగా పట్టించేస్తుంటాయి. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా చాలా వరకు మహిళలపై దారుణాలు, దొంగతనాలు తగ్గాయనే చెప్పుకోవచ్చు. తాజాగా సీసీ కెమెరాల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలకు వాహనాలు, క్రేన్లు ఇతర సామాగ్రిని పోలీసులు సమకూర్చారు. అలాగే ఈ బృందాలకు ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్ (EYES) అంటూ నామకరణం చేశారు. EYES బృందాలను ఈరోజు (గురువారం) సీపీ సజ్జనార్ ప్రారంభించారు. నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, మరమ్మతు చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానంగా పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమంలో నగర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్
Read Latest Telangana News And Telugu News