Deadline:పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 08:30 AM
హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు వెళ్లిపోయారు. పాకిస్థాన్ షార్ట్ టర్మ్ వీసా దారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసుల నోటిసులు పంపారు. పోలీసుల నోటిసులు, కేంద్ర ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్‌లో నలుగురు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు. మెడికల్ వీసా మీద వచ్చిన వారికి మంగళవారం వరకు మినహాయింపు ఇచ్చారు.

హైదరాబాద్: పాకిస్థాన్ దేశస్థులు (Pakistani nationals) భారత్ (India)ను వీడేందుకు మంగళవారం చివరి రోజు (Deadline).. మెడికల్ వీసా (Medical visa) మీద వచ్చిన వారికి ఈ రోజే డెడ్ లైన్.. దేశం విడిచి వేళ్ళిపోవాలని, లేని పక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు (Act enforcement ) ఉంటాయని తెలంగాణ పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నలుగురు పాకిస్థానీలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆ నలుగురిలో ఒక పురుషుడు, ఒక మహిళ అతని కూతురు, మరో మహిళ ఉన్నారు. ఎయిర్ పోర్టు మార్గం ద్వారనైనా, ఆటరీ బోర్డర్ నుండి వెళ్లాలని పోలీసులు వారికి సూచనలు చేశారు.
Also Read: చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా
కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయుుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులకు కొత్త టెన్షన్ మొదలైంది.భారత్ నుంచి తమ దేశానికి పాక్ పౌరులు వెళ్లిపోతున్నారు.
కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌లో నమోదైన పాకిస్థాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే డీజీపీ జితేందర్ కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణలో ఉంటున్న పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ విడిచి వెళ్లిన నలుగురు పాకిస్థానీలు..
ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు వెళ్లిపోయారు. పాకిస్థాన్ షార్ట్ టర్మ్ వీసా దారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసుల నోటిసులు పంపారు. పోలీసుల నోటిసులు, కేంద్ర ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్‌లో నలుగురు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు. మెడికల్ వీసా మీద వచ్చిన వారికి మంగళవారం వరకు మినహాయింపు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చేయను
For More AP News and Telugu News