Share News

KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. ఏం చర్చించారంటే..

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:46 PM

ఓటమి నేపథ్యంలో జూబ్లీహిల్స్ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. అయితే, పరాజయం తర్వాత జూబ్లీహిల్స్ కార్యకర్తలు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.

KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. ఏం చర్చించారంటే..
KTR Meets KCR

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll)లో ఓటమి తర్వాత మెుదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కలిశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ (KCR Erravalli Farmhouse)కు వెళ్లిన కేటీఆర్.. తమ పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి.. తదనంతర పరిణామాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యచరణపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్ వేదికగా కార్యకర్తలతో భేటీ కానున్నారు.


ఓటమి నేపథ్యంలో జూబ్లీహిల్స్ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. అయితే, పరాజయం తర్వాత జూబ్లీహిల్స్ కార్యకర్తలు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారితో సమావేశం నిర్వహించాలని కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను ఉత్తేజపరచడం, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 04:55 PM