Share News

KTR High Court: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:34 PM

KTR High Court: ఉట్నూరులో నమోదైన కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో బిగ్‌ రిలీఫ్ వచ్చింది. కాంగ్రెస్‌ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

KTR High Court: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
KTR High Court

హైదరాబాద్, ఏప్రిల్ 21: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (Former Minister KTR) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) భారీ ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛాలెంజ్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ బెంచ్‌ కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


గతంలో ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణమ్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి కామెంట్స్‌పై స్థానికంగా ఉన్న ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళణ పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్‌ అన్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ సుగుణమ్మ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై ఉట్నూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Tirumala Darshan: శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారో తెలుసా


ఈ కేసులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు జరుగగా.. హైకోర్టు ఈరోజు (సోమవారం) తుది తీర్పును వెల్లడించింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను (FIR) కొట్టివేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ బెంచ్ తీర్పును వెలువరించింది.


ఇవి కూడా చదవండి

Vamsi Bail: వంశీకి మళ్లీ నిరాశే

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 12:53 PM