KCR: కార్మిక లోకానికి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
ABN , Publish Date - May 01 , 2025 | 09:51 AM
హైదరాబాద్: కార్మిక లోకానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.

హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (International Labour Day) మేడే (May Day)ను పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖరరావు (Ex CM KCR) శ్రామిక, కర్షక, కార్మికలోకానికి మేడే శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రెస్ నోట్ (Press note) విడుదల చేశారు. ఉత్పత్తిలో భాగమై జాతి సంపదను సృష్టిస్తున్న సబ్బండ కులాల శ్రామికుల, పరిశ్రమలు తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల రెక్కల కష్టానికి వెలకట్టలేమని, వారి త్యాగం అసామాన్యమైనదని కేసీఆర్ తెలిపారు.
చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు కేసీఆర ఘన నివాళులర్పించారు. మేడే స్పూర్తితో, రాష్ట్రంలోని శ్రామికుల హక్కులను కాపాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసాను పెంచాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలను అమలు చేసి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించామని కేసీఆర్ అన్నారు.
Also Read: అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్
ఉత్పత్తి సేవా రంగాల్లో పాల్గొనే మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలను హక్కులను కల్పించి అండగా నిలిచామని కేసీఆర్ అన్నారు. సింగరేణి, ఆటోడ్రైవర్లు, పలు పరిశ్రమలు సహా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు అన్ని రకాలుగా భరోసా కల్పించాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్మికవర్గ అనుకూల విధానాలను మరింత బలోపేతం చేయడం ద్వారా, వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేయడం ద్వారా మాత్రమే, మేడే స్పూర్తికి, ప్రపంచ కార్మికలోక త్యాగాలకు మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..
CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..
For More AP News and Telugu News