Share News

Kannappa Movie: కన్నప్పకు బిగ్‌ షాక్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - May 27 , 2025 | 10:37 AM

Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్‌‌కు ఊహించని షాక్ తగిలింది.

Kannappa Movie: కన్నప్పకు బిగ్‌ షాక్.. ఏం జరిగిందంటే
Kannappa Movie

హైదరాబాద్, మే 27: హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప (Kannappa Movie). చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు ఆశలన్నీ కన్నప్ప చిత్రంపైనే పెట్టుకున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు మంచు విష్ణు. ఇందులో భాగంగా కన్నప్ప చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప చిత్రాన్ని రీమేక్ చేస్తూ అదే ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమాపై మంచు ఫ్యామిలీ భారీ అంచనాలే పెట్టుకుంది. చిత్రం ప్రమోషన్, చిత్రీకరణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైస్ కాకుండా మంచు మోహన్ బాబు కన్నప్పను తెరకెక్కిస్తున్నారు. అయితే కన్నప్ప చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు విష్ణుకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ చిత్రానికి అనుకోని సమస్య ఎదురైంది. ఈ సమస్య హీరో మంచు విష్ణుకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి.


ఇదీ విషయం..

కన్పప్ప హార్డ్ డ్రైవ్‌‌ను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయం అవడం సినిమా యూనిట్‌కు ఊహించని షాక్ అనే చెప్పుకోవాలి. దీంతో ఈ విషయంపై కన్నప్ప యూనిట్ ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్య శక్తుల ప్రోద్బలంతో హార్డ్ డ్రైవ్ మాయం అయిందంటూ ఎగ్గిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చరిత అనే యువతితో పాటు మరో వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఫిలింనగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కాగా.. కన్నప్ప చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అయితే ముందు ఈ సినిమాను ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైజ్‌గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కొన్నికారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడింది. చివరకు జూన్ 27న మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.


ఇవి కూడా చదవండి

టీడీపీ సక్సెస్‌కు టాప్ సీక్రెట్ అదే..

సింధూ నాగరికతకు ముందే మరోటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 27 , 2025 | 10:45 AM