Share News

Smita Sabharwal: మళ్లీ వార్తల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్

ABN , Publish Date - Apr 29 , 2025 | 07:56 PM

Smita Sabharwal: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆమెను పలుమార్లు వివిధ శాఖలకు బదిలీ చేశారు. తాజాగా మరోసారి ఆమె బదిలీ అయ్యారు.

Smita Sabharwal: మళ్లీ వార్తల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్
Senior IAS Smita Sabharwal

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఆ జాబితాలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ఖాతా వేదికగా మరోసారి స్మితా సబర్వాల్ స్పందించారు. ఆ క్రమంలో తన బదిలీపై ఆమె ఆసక్తికర ట్విట్ చేశారు. ఈ సందర్భంగా భగవత్ గీతలోని శ్లోకాన్ని "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన.. అంటూ ఆమె తన పోస్టును ప్రారంభించారు. నిర్లక్ష్యం చేసిన పర్యాటక శాఖను నాలుగు నెలల్లో పట్టాలెక్కించానన్నారు. అలాగే జవాబుదారితనంలో పర్యాటక శాఖకు గుర్తింపు సైతం తీసుకు వచ్చానని చెప్పారు.

అదే విధంగా హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి సైతం ఆమె ప్రస్తావించారు. ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పునాది వేశానని .. ఇది అనేక అవకాశాలకు తలుపు తీస్తోందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. స్మితా సభర్వాల్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


ఇక ఇటీవల హైదరాబాద్ శివారులోని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో.. స్మితా సభర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూన్నారు.


కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆమెకు పోలీసులు నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు పర్యాటక, సాంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శిగా జయేష్ రంజన్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Telangana 10th Results: 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల.. ఎప్పుడంటే..

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 08:04 PM