Share News

HYDRA New Logo: నీటిబొట్టుతో సరికొత్తగా హైడ్రా లోగో

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:19 PM

HYDRA New Logo: కొత్త లోగోను విడుదల చేసింది హైడ్రా. ఇకపై నూతన లోగోతోనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

HYDRA New Logo: నీటిబొట్టుతో సరికొత్తగా హైడ్రా లోగో
HYDRA New Logo

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) (HYDRA) కొత్త లోగోను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈవీడీఎం లోగోనే హైడ్రా వినియోగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా లోగోను రూపొందించింది హైడ్రా. హెచ్‌ అక్షరంపై నీటి బొట్టుతో హైడ్రా లోగోను రూపకల్పన చేశారు. ఇకపై కొత్త లోగోతోనూ హైడ్రా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. హైడ్రా కార్యాలయం, వాహనాలు, సిబ్బంది యూనిఫాంపై కూడా కొత్త లోగో కనిపించనుంది. అలాగే హైడ్రా అధికారిక ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌కు కొత్త లోగోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టారు.


అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. ప్రజలను విపత్తల నుంచి రక్షించడమే కాకుండా.. వారి ఆస్తులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైడ్రా వచ్చి కొత్తలోనే తన మార్క్‌ను చూపించింది. నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ఇప్పటి వరకు అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. చెరువులు, కుంటలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. అలాగే అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వస్తున్న వినతులపై వెంటనే స్పందిస్తూ.. ముందుగా వారికి నోటీసులు ఇచ్చి.. ఆపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోతo వెంటనే యాక్షన్‌లోకి దిగుతోంది హైడ్రా.


బతుకమ్మ కుంట పనులు షురూ

మరోవైపు నగరంలోని అంబర్‌పేట్‌ బతుకమ్మకుంట అభివృద్ధి పనులను హైడ్రా మొదలుపెట్టింది. బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటలోనే ఈసారి బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయన్నారు. బతుకమ్మ కుంట కోర్టు వివాదం పరిష్కారమైందని రంగనాథ్ చెప్పుకొచ్చారు. స్థానికులతో కలిసి పూజలు చేసి బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను కమిషనర్ ప్రారంభించారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు జ‌ర‌గాల‌ని అధికారుల‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 04:19 PM