Kokapet Land Prices Record: మరో సంచలనం.. కోకాపేట ఎకరం రూ.137.25 కోట్లు..
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:41 PM
హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది.
హైదరాబాద్: కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. HMDA అధికారులు ప్లాట్ నెంబర్ 17, 18కి ఈ వేలం నిర్వహించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ప్లాట్ నెం. 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి రూ. 136.50 కోట్లు పలికింది. ప్లాట్ నెం 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి రూ.137.25 కోట్లు పలికింది. వేలంలో 9.90 ఎకరాలకుగాను HMDAకి రూ.1,355.33 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేటలో మిగిలిన భూములను నవంబర్ 28వ తేదీన HMDA అధికారులు వేలం వేయనున్నారు.
కాగా, నియోపొలీస్ లేఅవుట్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. అంతేకాకుండా, ఇక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించాలన్నదానిపై పరిమితి కూడా లేదని తెలుస్తోంది. ఫ్లోర్స్ విషయంలో లిమిట్ లేకపోవడంతో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అటు ORRకు ఇటు రాయదుర్గం IT కంపెనీలకు దగ్గరగా ఉండటంతో కోకాపేట భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News