Hyderabad Police Raids: నగర శివారుల్లోని ఫార్మ్ హౌస్‌ల్లో తనిఖీలు..
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:42 PM
రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని పలు ఫార్మ్ హౌస్‌ల్లో పోలీసలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా ఆ ఫామ్స్ హౌస్‌లలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, నవంబర్ 02: రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని ఫార్మ్ హౌస్‌లతోపాటు చేవెళ్ల మండలం మూడింయల్ గ్రామంలో.. మొయినాబాద్ మండలంలోని టోల్ కట్టా గ్రామ పరిధిలోని మొత్తం 39 ఫార్మ్ హౌస్‌ల్లో ఆదివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టోల్ కట్ట గ్రామ పరిధిలో అజీముద్దీన్ ఫార్మ్ హౌస్‌లో పలువురు హుక్కా సేవిస్తున్నట్లు గుర్తించారు. అలాగే అదే ప్రాంతంలోని ప్రాణవా విల్లా హిల్స్‌లో ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 18 బీర్ బాటిల్స్, విస్కీ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇదే ప్రాంతంలో 12 ఫార్మ్ హౌస్‌ల్లో అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. అందుకు సంబంధించి 29 మంది యువతి, యువకుల అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. కానీ వారెవరూ డ్రగ్స్ తీసుకోలేదని పరీక్షల్లో స్పష్టమైంది.
అలాగే సౌండ్ పొల్యూషన్, ఫైర్ క్రాకర్స్, విస్కీ, రమ్, వోడ్కా, వైన్ వివిధ బ్రాండ్లకు చెందిన బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడింయల్ విలేజ్‌లో వాహనంలో హుక్కా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మూడింయల్ విలేజ్‌లోని రితిక ఫార్మ్ హౌస్‌లో 150 మంది స్కూల్ పిల్లలతో భారీ శబ్దాలలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో కొందరు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఫార్మ్ హౌస్ చెకింగ్ అనంతరం టోల్ కట్ట విలేజ్ వద్ద డ్రంక్ ఎండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అయితే ఫార్మ్ హౌస్‌లలో ఈవెంట్స్‌కు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అనుమతులు తీసుకోకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు త్వరలో బయటపెడతా? : పీఏసీ చైర్మన్ అరికేపూడి
శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు..
For More TG News And Telugu News