CP Sajjanar On iBomma Ravi Case: ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:04 PM
ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశామని, అతడిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు.
హైదరాబాద్: దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు ఛాలెంజ్ చేసిన ఐ బొమ్మ రవి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్ సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైరసీపై సంచలన విషయాలు బయటపెట్టారు.
ఐ బొమ్మ రవి హార్డ్ డిస్క్ లలో దాదాపు 21 వేలకు పైగా సినిమాలు ఉన్నాయని తెలిపారు. పైరసీ ద్వారా రవి రూ. 20 కోట్లు సంపాదించాడని, అందులో రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశామని చెప్పారు. రవికి ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయని, ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐ బొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది సమాచారం ఉందని వెల్లడించారు. డేటా కలెక్షన్ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని సీపీ వివరించారు.
పైరసీతో సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగిందన్నారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశామన్నారు. ఐ బొమ్మ రవిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు. రవి.. వెబ్ సైట్ డిజైన్, డెవలపింగ్‌లో ఆరితేరాడని, సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను పైరసీ చేస్తాడని తెలిపారు. ఒక సైట్‌ను బ్లాక్ చేస్తే.. మరో సైట్‌ను డెవలప్ చేస్తాడని వెల్లడించారు. రవి సైట్ ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్స్ అట్రాక్ట్ చేస్తాయని, బెట్టింగ్ యాప్స్‌తో జనం వేల కోట్లు నష్టపోయారని వ్యాఖ్యానించారు. కస్టడీకి ఇస్తే ఐ బొమ్మ రవి నుంచి పూర్తి వివరాలు రాబడుతామని, ఆయన నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఘోర రోడ్డు ప్రమాదం.. సౌదీలో 42 మంది భారతీయులు మృతి..
సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News