Share News

Constable: గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:31 PM

Hyderabad.. నగరంలోని కుత్బుల్లాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న బాలనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి.. తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలారు...

Constable: గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి
Constable Dies

Hyderabad: కుత్బుల్లాపూర్‌ (Qutbullapur)లో విషాదం (Tragedy) చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని (Ganja Raid) సమాచారం అందుకున్న బాలానగర్ జోన్ ఎస్‌వోటి పోలీసులు (SOT Police) తనిఖీలకు వెళ్లారు. ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఓ కానిస్టేబుల్ ప్రవీణ్(39) (Constable Praveen) నిల్చున్న చోటే కుప్పకూలిపోయారు. అది గమనించిన తోటి సిబ్బంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే కానిస్టేబుల్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండె పోటు (Heart Attack) కారణంగా ప్రవీణ్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. కానిస్టేబుల్ మృతితో బాలానగర్ జోన్ ఎస్‌వోటి బృందం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది.


ములుగు జిల్లాలో మరో ఘటన జరిగింది. గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ రేగా చుక్కారావు (39) మృతి చెందారు. ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన స్వస్థలం తాడ్వాయి మండలం కామారం. చుక్కారావు మృతితో ఆ కుటుంబంలో విషాదా ఛాయలు అలుముకున్నాయి.


గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు..

మరోవైపు గంజాయి తరలిస్తున్న ఇ ద్దరు యువకులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వా ధీనం చేసుకొని కేసు నమోదు చేసి నట్లు కేయూ ఎస్ఐ సుంకరి రవికుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కేయూ పోలీసు స్టేషన్ పరిధి రెడ్డిపురం విజయలక్ష్మి కాలనీ, ప్రాంతంలో కేయూసీ ఎస్ఐ పోలీసు సిబ్బందితో శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ లష్కర్ సింగారానికి చెందిన సాయి విఘ్నేష్ అలియాస్ సన్నీ, హసన్‌పర్తికి చెందిన పెద్దమ్మ సాయి గణేష్ ద్విచక్రవాహనంపై రెడ్డి పురం విజయలక్ష్మి కాలనీలో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసు సిబ్బంది అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకొని విచారించగా 500 గ్రాముల గంజాయి లభించింది. అలాగే ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వారు మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన పారీదాఖాన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కొంత సేవించి మిగతా గంజాయిని రైల్వే స్టేషన్లు, కాలేజీల ప్రాంతంలో ప్యాకెట్లుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు ఎస్ఐ రవికుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..

విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 22 , 2025 | 12:31 PM