Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫిటిషన్‌పై తీర్పు వాయిదా..
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:00 PM
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేసిన రెండు నెలలు తరువాత గిరిజన నాయకులు ఫిర్యాదు చేశారని, ఇందులో దురుద్దేశం ఉందని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ విషయమై విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పారని హైకోర్టుకు వివరించారు.

హైదరాబాద్: సినీ హీరో విజయ్ దేవరకొండ దాఖలు చేసిన ఫిటిషన్‌పై ఇవాళ(గురువారం) తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది. గతంలో విజయ్ దేవరకొండ ఓ మూవీ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా, వారి ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విజయ్ తరఫు న్యాయవాది కోర్టులో ఇవాళ తన వాదనలు వినిపించారు. విజయ్ వ్యాఖ్యలు చేసిన రెండు నెలలు తరువాత గిరిజన నాయకులు ఫిర్యాదు చేశారని, ఇందులో దురుద్దేశం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పారని హైకోర్టుకు వివరించారు. అయితే సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణలు పరిగణలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరువురి వాదనలు ముగియడంతో హైకోర్ట్ తీర్పును వాయిదా వేసింది.
Also Read:
ఓవల్ టెస్ట్‌లో భారత్‌కు వరుణుడి శాపమా, వరమా?
జీపు కింద పడ్డ మొసలి.. చివరకు ఏం చేసిందో చూస్తే..
For More Telangana News and Telugu News..