Share News

Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:19 PM

Heavy Rain Alert: హైదరాబాద్‌లో మరో గంటలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో
Heavy Rain Alert

హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్‌కు (Hyderabad) భారీ వర్ష (Heavy Rain) సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీగా వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రాగల గంటలో ఈదుగుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.


మరో రెండు, మూడు రోజులు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలుతో కూడిన వర్షం కురుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో పరిధిలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు మాన్‌సూన్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. వర్షాలకు నీరు నిలిచిపోకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Dowry Harassment: ఎంత దారుణం.. మహిళను వివస్త్రను చేసి ఆపై


అత్యవసరమైతేనే

అయితే మరో గంటలో వర్షం పడనుండటంతో అప్పుడే ఆఫీసుల నుంచి ప్రజలు ఇళ్లకు బయలుదేరనున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాన్‌సూన్ టీంను సిద్ధం చేశారు. అకాల వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దంటూ బల్దియా అధికారులు చెబుతున్నారు.


ఏపీలోనూ

అలాగే తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈరోజు, రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ, కోస్తాలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు రాయలసీమ జిల్లాలోనూ నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. సీమలోనూ గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Case against Thopudurthi: రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్.. కారణమిదే

Lookout Notice: కాకాణితో సహా మిగిలిన నిందితుల‌ కోసం పోలీసులు గాలింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:36 PM