Share News

Female Doctor Harassment: పెళ్లి అంటూ మోసం.. మహిళా వైద్యురాలిపై దారుణం

ABN , Publish Date - May 21 , 2025 | 10:42 AM

Female Doctor Harassment: బంజారాహిల్స్‌లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ డాక్టర్.

Female Doctor Harassment: పెళ్లి అంటూ మోసం.. మహిళా వైద్యురాలిపై దారుణం
Female Doctor Harassment

హైదరాబాద్, మే 21: మహిళలు ఎంతో కష్టపడి ఉన్నతస్థాయిలకు చేరుకుంటున్నారు. కానీ వారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ లైంగిక దాడులకు బలవుతూనే ఉన్నారు కొందరు మహిళలు. ప్రతీరోజు ఎక్కడో ఓ చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు, లైంగిక దాడుల వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డుపై తిరిగితేనే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. కానీ ఇప్పుడు పగలే మహిళలు ఒంటరిగా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.


స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగం చేసే చోట ఇలా ప్రతీచోట మహిళలను కొందరు వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఇక డాక్టర్లుగా పనిచేస్తున్న పలువురు మహిళలు కూడా సీనియర్ డాక్టర్ల వేధింపులకు బలైన ఘటనలు ఎన్నో చూశాం. చాలా మంది ఆ వేధింపులు తాళళేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది.


బంజారాహిల్స్‌లో (Banjarahills) ఓ మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడి చేశాడు. స్వామి అనే వైద్యుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సదరు మహిళా వైద్యురాలు నిలోఫర్ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేస్తున్నారు. డాక్టర్ స్వామి మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానంటూ మహిళా డాక్టర్‌ను నమ్మించాడు స్వామి.


ప్రముఖ హోటల్‌కు రావాల్సిందిగా కోరాడు. అతడి నమ్మి వెళ్లిన మహిళా డాక్టర్‌పై డాక్టర్ స్వామి లైంగిక దాడి చేశాడు. ఇక అప్పటి నుంచి మహిళా డాక్టర్‌ను పట్టించుకోవడం మానేశాడు డాక్టర్ స్వామి. తనను పెళ్లి చేసుకోవాలని మహిళా వైద్యురాలు పదే పదే కోరినప్పటికీ స్వామి నిరాకరించాడు. ఎన్నిసార్లు అడిగినప్పటికీ స్వామి నుంచి నిరాకరణే ఎదురైంది. వైద్యుడి మోసాన్ని గుర్తించిన మహిళా డాక్టర్ పోలీసులను ఆశ్రయించింది. డాక్టర్ స్వామిపై బంజారాహిల్స్ పోలీసులకు మహిళా డాక్టర్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు

Miss World contestants: రొమ్ము క్యాన్స‌ర్‌ అవగాహనలో మిస్ వరల్డ్ బ్యూటీస్ తోడ్పాటు

Read latest Telangana News And Telugu News

Updated Date - May 21 , 2025 | 10:47 AM