Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:42 AM
ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో ఈఎన్‌సీ హరి రామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించిన 14 చోట్ల అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సోదాలు ముగిసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున జడ్జి ముందు హాజరు పర్చగా విచారణ జరిపి న్యాయమూర్తి హరిరామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.

హైదరాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ (ENC) హరి రామ్ (Hari Ram) ఇంట్లో ఏసీబీ సోదాలు (ACB Investigation) ముగిసాయి. అనంతరం పోలీసులు ఆయనను అర్ధరాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ (14 Day Remand) విధించారు. రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హరి రామ్ ఇంటితోపాటు ఏకకాలంలో బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 14 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. గజ్వేల్‌లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. మార్కుర్‌లో 28 ఎకరాల భూమి, కొండాపూర్ షేక్స్‌పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్‌ను గుర్తించారు.
హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్) భూక్యా హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం అరెస్టు అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరోపక్క, కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్ ఇల్లు, జలసౌధ కార్యాలలయం, హరిరామ్ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు శనివారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు కళ్లుచెదిరే ఆస్తులను గుర్తించారు. ఏసీబీ ప్రకటన ప్రకారం.. హరిరామ్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న మర్కూక్ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది. అంతేకాక, హైదరాబాద్‌లోని షేక్‌పేట్, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్‌కాలనీ, నార్సింగ్‌లో ఫ్లాట్లు ఉన్నాయి. పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి.
బొమ్మలరామారంలో ఆరు ఎకరాలలో ఫామ్‌హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక, బీఎండబ్ల్యూ సహా రెండు కార్లు, ఉన్నాయి. ఇవే కాక, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో భారీగా ఉంటుందని పేర్కొంది. సోదాలు కొనసాగుతున్నాయని, హరిరామ్ ఆస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశముందని ఏసీబీ పేర్కొంది. కాగా, హైదరాబాద్, షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్‌లో హరిరామ్ నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. అక్కడి కంప్యూటర్లు, లాప్‌టా్‌పలను పరిశీలించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ భార్య అనిత ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎదురుగడ్డ గ్రామం.. హరిరామ్ స్వగ్రామం. ఎదురగడ్డలోని హరిరామ్ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇంట్లో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలోని బృందం సోదాలు చేసింది. నిజానికి, ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారం చాలా రోజుల నుంచే ఉండడంతో హరిరామ్ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా ఆస్తులు బినామీల పేర్లతో పెట్టారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
నేను భారత్ కోడలిని.. ఇక్కడే ఉంటా
For More AP News and Telugu News