Dil Raju : ఐటీ దాడులు.. మహిళా అధికారితో వాదన.. దిల్ రాజు సీరియస్
ABN , Publish Date - Jan 23 , 2025 | 06:29 PM
Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో మూడో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతోన్నాయి. అలాంటి వేళ.. కీలక పత్రాలను ఐటీ శాఖ ఉన్నతాధికారి పరిశీలిస్తు్న్నారు. ఆ సమయంలో ఆమెకు ఆయన వాదనకు దిగారు.

హైదరాబాద్, జనవరి 23: ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు సోదాలు మూడో రోజు.. గురువారం కొనసాగుతోన్నాయి. అలాంటి వేళ.. డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న మహిళా ఉన్నతాధికారితో దిల్ రాజు వాదనకు దిగారు. దీంతో సదరు మహిళా అధికారి ప్రతిస్పందించగా.. దిల్ రాజు సీరియస్‌గా అక్కడ నుంచి ఆయన వేగంగా వెళ్లిపోయారు. సంక్రాంతి పండగ వేళ.. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజ్ నిర్మాతగా గేమ్ చేంజర్ చిత్రం విడుదలైంది. అలాగే విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కినన సంక్రాంతి వస్తున్నాం చిత్రం సైతం రిలీజ్ అయింది. ఇక డిసెంబర్ తొలి వారంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 చిత్రం విడుదలైంది.
ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొన్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అయితే దిల్ రాజ్ నివాసంలో తనిఖీలు ఇంకా కొనసాగుతోన్నాయి. మరోవైపు ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రచారం అయితే నడుస్తోంది. అదీకాక పుష్ప 2 చిత్రం సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకొంది.
దీంతో మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాతలు నివాసాల్లో సైతం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో ఇటీవల విడుదలైన చిత్రాలను ఎన్ని కోట్ల రూపాయిలతో నిర్మించారు. అంత నగదు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు. ఆ యా సినిమాలకు ఏ మేర లాభాలు వచ్చాయి. పన్నుల రూపంలో ఎంత చెల్లించాల్సి ఉంది.. తదితర అంశాలకు సంబంధించి ఆ యా చిత్రాల నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: వాతావరణ శాఖ కీలక అలర్ట్.. రిపబ్లిక్ డే వరకు..
ఇంకోవైపు దిల్ రాజు నివాసంలో తనిఖీల్లో భాగంగా ఆయన భార్య తేజస్వీనిని ఐటీ శాఖ అధికారులు స్వయంగా బ్యాంకుకు తీసుకు వెళ్లారు. బ్యాంక్ ఖాతాలతోపాటు లాకర్లను ఆమెతో ఐటీ శాఖ అధికారులు స్వయంగా తెరిపించినట్లు మీడియాలో కథనాలు సైతం వెల్లువెత్తాయి. ఇక దిల్ రాజు నివాసంలో ఐటీ శాఖ అధికారులు మరికొద్ది రోజులు.. సోదాలు నిర్వహించనున్నారని ఓ ప్రచారం అయితే ఫిల్మ్ నగర్‌లో కొనసాగుతోంది.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Also Read: తక్కువ పెట్టుబడితో.. రోజుకు రూ.10 వేలు లాభం
For Telangana News And Telugu News