Share News

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:38 AM

సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు తెలంగాణ సైబర్ పోలీసులు 7గురు ఢిల్లీ వెళ్లారు. నేరస్థుడిని అరెస్టు చేసిన తర్వాత రాత్రి తెలంగాణ భవన్‌కు తీసుకువెళ్లారు. అక్కడే నేరస్థుడితోపాటు పోలీసులు పడుకున్నారు. తెల్లవారి లేచి చూసేసరికి పోలీసులు షాక్ తిన్నారు. నేరుస్థుడుతు పోలీసులు కళ్లుగప్పి పారిపోయాడు.

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
Cyber Criminal Escapes

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ (Telangana Bhavan) నుంచి సైబర్ నేరస్తుడు పరారయ్యాడు (Cyber Criminal Escapes). అమాయకులను మోసం చేసిన సైబర్ నేరస్తుడిని తెలంగాణ సైబర్ పోలీసులు (Telangana Cyber Police) పట్టుకున్నారు. ఢిల్లీ (Delhi)లో అరెస్ట్ (Arrest) చేసి ఆదివారం రాత్రి తెలంగాణ భవన్‌‌కు తీసుకొచ్చారు. తమతోపాటు సైబర్ నేరస్తుడిని రూంలోనే ఉంచుకొని పోలీసులు నిద్రపోయారు. అయితే సోమవారం ఉదయం లేచి చూసేసరికి నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. దీంతో సైబర్ నేరస్తుడిపై ఢిల్లీ పోలీసులకు తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు. కాగా, మరోోవైపు ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది అంతా ఉండగా కళ్లుగప్పి ఎలా పారిపోయాడంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సైబర్ నేరస్తుడిని రాత్రి సమయంలో తమతో ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Also Read..: గుజరాత్‌లో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన..


మరోవైపు సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌ పద్ధతిలో బ్యాంకు ఖాతాలు సమకూర్చుతూ సహకరిస్తున్న ముంబై యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవీ ముంబైలో ఉంటున్న రష్మిత్‌ రాజేంద్ర పాటిల్‌ (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు సైబర్‌ నేరగాళ్లతో చేతులు కలిపి వారికి బ్యాంకు ఖాతాలు సమకూర్చడం మొదలుపెట్టాడు. సైబర్‌ నేరగాళ్లు తాము మోసం చేసి కాజేసిన సొమ్మును రష్మిత్‌ ఇచ్చిన ఖాతాలకు బదిలీ చేసేవారు. వాటిలోకి వచ్చిన డబ్బులో కొంత కమీషన్‌ తీసుకొని మిగతా డబ్బును వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేస్తున్నాడు. ఇదిలాఉండగా..


హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి (56)ని షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పేరుతో మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు ఆయన నుంచి రూ.2.43 కోట్లు వసూలు చేశారు. ఈ డబ్బును రష్మిత్‌ అందించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రష్మిత్‌ సమకూర్చిన బ్యాంకు ఖాతాల్లో బాధితుడి డబ్బు డిపాజిట్‌ అయినట్లు గుర్తించారు. సైబర్‌ క్రైం డీసీపీ కవిత దార ఆదేశాల మేరకు సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ పి. ప్రమోద్‌, ఎస్సై షేక్‌ అజీజ్‌ల బృందం ముంబై వెళ్లి నిందితుడు రష్మిత్‌ను అరెస్ట్‌ చేసి నగరానికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు

చెప్పిన మాటకు కట్టుబడని నేత..

భారత్‌ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

For More AP News and Telugu News

Updated Date - Apr 21 , 2025 | 12:21 PM