Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:45 PM
Miss World 2025: మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 29: మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఉన్నతాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులోభాగంగా ఎయిర్ పోర్టులు, అతిథులు బస చేసే హోటళ్లతోపాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.
ఈ పోటీలకు వచ్చే అతిథులు .. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు,పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం వివరించారు. అలాగే నగరంలో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ మిస్ వరల్డ్ పొటీలు ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఇవి మే 7వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. వేర్వేరు వేదికలపై వేర్వేరు థీమ్‌లతో వీటిని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.దేశ,విదేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు అతిథులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ తరలిరానున్నారు. మే 10వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. మే 12వ తేదీన బుద్ధభవన్‌లో అందాల భామలతో అధ్యాత్మిక పర్యటన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్, హదరాబాద్‌లలో హెరిటేజ్ వాక్‌లు ఏర్పాటు చేశారు. ఇక మే 13వ తేదీన చౌమహల్లా ప్యాలెస్‌లో సుందరాంగులు, అతిథులకు వెలకం డిన్నర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి
Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్‌పై మంత్రి సీతక్క రియాక్షన్
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు
Read Latest Telangana News And Telugu News