CM Revanth Reddy: ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:41 PM
CM Revanth Reddy: ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కేకే, జానారెడ్డిలతో శాంతి చర్చలపై ఇవాళ సమావేశం అయ్యామని అన్నారు. ఈ విషయంలో జానారెడ్డి సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: ఛత్తీస్‌ఘడ్ తెలంగాణ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ చర్యలపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రేవంత్‌రెడ్డితో నిన్న(ఆదివారం) శాంతి చర్చల కమిటీ భేటి అయింది. ఈ భేటిలో రేవంత్‌రెడ్డి దృష్టికి పలు కీలక విషయాలను నేతలు తీసుకువచ్చారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి తమ కేబినెట్‌లోని మంత్రులతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
సామాజిక అంశంగానే మావోయిస్టుల సమస్య...
మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల అంశంగా చూడమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక అంశంగానే మావోయిస్టుల సమస్యను చూస్తామని చెప్పారు. కాగా ఇవాళ(సోమవారం) మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో శాంతి చర్చలపై సమావేశం జరిగింది. శాంతి చర్చలపై సీఎం రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, కేకే, వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో ఫోన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ పార్టీ ఇన్‌చార్జిగా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. ఈ సమావేశం అనంతరం శాంతి చర్చలపై మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గతంలో శాంతి చర్చలు జరిగినప్పటి విషయాలను అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఈ విషయంపై కేకే, జానారెడ్డి, దిగ్విజయ్ సింగ్‌లతో చర్చించినట్లు తెలిపారు. జాతీయ పార్టీలో జాతీయ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఆ తర్వాతే ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం...
కగార్‌పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరని ప్రశంసించారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదేనని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని ఆరోపణలు చేశారు. తనకు ,రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందని ఉద్ఘాటించారు. తాను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీంలు ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని తెలిపారు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు. నిన్నటి వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కేసీఆర్‌పై ఫైర్...
పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని... మరి వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదని విమర్శించారు. సంవత్సరన్నర నుంచి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు తీసుకు వచ్చామని... ఇప్పుడు వాటన్నింటిని సమీక్షిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను చట్టప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయమని ప్రజల నుంచి తమకు డిమాండ్ వస్తోందని చెప్పారు. తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని అన్నారు. గతంలో అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పానని... అలాగే ఆయనకు ఇప్పించానని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డామని.. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేది ఎలా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ
Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి
Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్!
Read Latest Telangana News And Telugu News