Birthday Celebrations: హైదరాబాద్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:17 PM
75 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు నందమూరి సుహాషిని తన హృదపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్ అని చెప్పుకునేవారు.. నేడు మాత్రం ఐటిసిటీ కోసం మాట్లాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ ఎంతో గొప్పదని అన్నారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) 75వ జన్మదినం (75th birthday) సందర్బంగా హైదరాబాద్, మణికొండ (Manikonda), పంచవటి సాయిలక్ష్మీ కాలనీలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి రామకృష్ణా, (Nandamuri Ramakrishna) సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ (Ex MP Muralimohan), తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాషిని (Nandamuri Suhasini) హాజరయ్యారు. ఇంకా ఏపీ స్టేట్ క్రియేటివ్ కల్చర్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని , ఏపీ టీటీడీ బోర్డు మెంబర్ నర్సిరెడ్డి, తెలుగు టీవీ అండ్ ఓటీటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర , తెలంగాణ మాజీ టీడీపీ ప్రెసిడెంట్, టీడీపీ పొలిట్ బ్యూరో బక్కాని నరసింహులు, టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్ణ , ప్రొడ్యూసర్ ఫిలిం యాక్టర్ బండ్ల గణేష్, వీరమాచినేని రామ కృష్ణ, వ్యాపార ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు, టీడీపీ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
Also Read..: MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..
చంద్రబాబు విజన్ ఎంతో గొప్పది..
75 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు సుహాషిని తన హృదపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్ అని చెప్పుకునేవారు.. నేడు మాత్రం ఐటిసిటీ కోసం మాట్లాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ ఎంతో గొప్పదని అన్నారు. 2047 విషన్ పేరుతో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరుగుతుందని, హైదరాబాద్ ఐటి సిటీగా ఎంతో ప్రసిద్ధి చెందిందని సుహాసిని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో..
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నందమూరి సుహాసిని, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, తెలుగుదేశం నేత అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో 164 సీట్లతో గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు..
ఏపీ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
గుజరాత్ పర్యటనకు నారాయణ బృందం..
For More AP News and Telugu News