Share News

Police Case: సినీనటి కల్పికపై కేసు నమోదు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 11:50 AM

Kalpika Case: టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రిజం పబ్‌లో యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పబ్ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.

Police Case: సినీనటి కల్పికపై కేసు నమోదు..
Case Filed Against Actress Kalpika

Hyderabad: టాలీవుడ్ నటి కల్పిక (Tollywood actress Kalpika)కు ఊహించని షాక్ (Shock) తగిలింది. ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ (BNS Act) ప్రకారం 324(4), 352, 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రిజం పబ్‌ (Prizm Pub)లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ఆమె ప్రవర్తించారు. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు నమోదు చేశారు.


వివాదంలో నటి కల్పిక...

కాగా టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గత నెల (మే) 29న ప్రిజం పబ్‌లో పుట్టినరోజు సందర్బంగా నటి కల్పిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో కేకు విషయంలో పబ్ సిబ్బంది.. నటి కల్పిక మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పబ్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్‌లో జరిగిన గొడవను యాజమాన్యం రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించింది.


నటి కల్పిక వివరణ..

కాగా ఈ గొడవకు సంబంధించి నటి కల్పిక వివరణ ఇచ్చారు. కేకు విషయంలో పబ్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, బూతులతో రెచ్చిపోయారని, తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించడంవలనే సిబ్బందితో వాగ్వాదం జరిగిందని ఆమె అన్నారు. గొడవకు సంబంధించిన వీడియోలను కల్పిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరును కూడా ఆమె ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి:

తల్లికి వందనం పథకానికి జీవో జారీ

బంగారు భవిష్యత్ దిశగా ఏపీ అడుగులు

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 12 , 2025 | 11:50 AM