Share News

BLIA : పేద విద్యార్థులకు అండగా బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

ABN , Publish Date - Aug 02 , 2025 | 08:29 PM

సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ). పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.

BLIA : పేద విద్యార్థులకు అండగా బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్
BLIA బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

హైదరాబాద్, ఆగష్టు, 2 : సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ) పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. హైదరాబాద్ కవాడిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిదివే 1 నుండి 5 తరగతుల పిల్లలకు 271 జతల బూట్లు, ఇండోర్ స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. పావన అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

BLIA-2.jpg


ఇండోర్ ఆట వస్తువులను బీఎల్ఐఏ హైదరాబాద్ సభ్యులు విరాళంగా ఇచ్చారు. బూట్లను సింగపూర్ చాప్టర్‌కు చెందిన మేడమ్ మోరిన్ అందించారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా భాగస్వామ్య విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని.. బీఎల్ఐఏ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. మాస్టర్ సింగ్ యున్ మార్గదర్శకత్వంలో స్థాపించబడిన బీఎల్ఐఏ.. మానవతా బౌద్ధమతాన్ని ప్రతిబింభిస్తుంది. కరుణ, సేవ, విద్య ద్వారా పేద పిల్లల జీవితంలో ఆధ్యాత్మిక అభ్యాసాన్ని అనుసంధానిస్తుంది.

BLIA-3.jpg


సంఘరఖ్ఖిత మహాథెరో నాయకత్వంలో, బీఎల్ఐఏ దక్షిణాసియా సలహాదారు చుహ్మెన్ నిరంతర సేవ చేస్తున్నారు. గతంలో మహబూబ్ నగర్, ఖమ్మం, షాద్ నగర్, హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు అవసరమైన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు.

BLIA-4.jpg


ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా.. బౌద్ధ తత్వశాస్త్రంలో బోధించిన దశ పరమిత (పది పరిపూర్ణతలు) ముఖ్యంగా దాన పరమిత (ఉదారత్వం పరిపూర్ణత)లకు ఇది సజీవ ఉదాహరణ. పాదరక్షలు, ఆటవస్తువులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం ద్వారా బీఎల్ఐఏ హైదరాబాద్ పేద పిల్లలకు ఆనందం, ఆశ, గౌరవాన్ని తీసుకురావాలనే లక్ష్యాన్ని కొనసాగిస్తోంది.

BLIA-5.jpg


BLIA-6.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 08:35 PM