KTR: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
ABN , Publish Date - Apr 28 , 2025 | 06:41 PM
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం రేవంత్ రెడ్డి వేలాది కోట్ల రూపాయిలు ముడుపులు తీసుకు వెళ్లి ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి అందిస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కేటీఆర్‌పై కేసు నమోదయింది.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈ కేసును జస్టిస్ కె. లక్ష్మణ్ కొట్టివేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి రూ. 2500 కోట్లు పంపించారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. దీంతో కేటీఆర్‌పై 504, 505(2) కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన ఆధీనంలో ఉంచుకొన్నారని ఆరోపించారు. ఆయనకు ముడుపులు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. అలా వసూల్ చేసిన నగదు రూ 2500 కోట్లు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పంపారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి:
CM Siddaramaiah: మరో వివాదంలో సీఎం సిద్దరామయ్య.. వీడియో వైరల్
Attention train passengers: మే 1 నుంచి రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
Pahalgam Attack: దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ అధిష్టానం
AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి
Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..
Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..
For National News And Telugu News