BRS: తెలంగాణ తల్లి, ప్రొ.జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ నివాళి..
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:14 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి, మూలస్తంభాలని 25 ఏళ్ల ప్రస్థానానికి, వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం, ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో, కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పురుడు పోసుకుందని అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆవిర్భావ దినోత్సవం (Foundation Day) సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ తల్లి (Telangana Talli), ప్రొఫెసర్ జయశంకర్ (Prof Jayashankar) విగ్రహాలకు (Statue) ఆయన ఘనంగా నివాళులుర్పించారు. పార్టీ జెండాను ఎగరవేశారు. అలాగే జలదృశ్యం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి (Konda Laxman Bapuji) నివాళులర్పించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గన్ పార్కు వద్ద అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ నివాళులర్పించారు.
Also Read..: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
అక్కడే బీఆర్ఎస్ పురుడుపోసుకుంది..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి, మూలస్తంభాలని 25 ఏళ్ల ప్రస్థానానికి, వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం, ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో, కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పురుడు పోసుకుందని అన్నారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, లక్షల మందితో బలోపేతమై, తెలంగాణను సాధించిందని అన్నారు. పార్టీ పుట్టిన జల దృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబురానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి, కొండంత అండగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీకి వినమ్ర నివాళి అంటూ వ్యాఖ్యానించారు. మా పార్టీ కి, ఆనాడైనా ఈనాడైనా, తెలంగాణనే ఏకైక ఎజెండా అని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నామన్నారు. 25 సంవత్సరాలు నిండి, అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాలతో, మరో 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు.
రజతోత్సవ సభ
కాగా వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ సోమవారం జరుగుతుంది. 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న అప్పటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్.. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోకసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవి చూసిన బీఆర్ఎస్.. వరంగల్ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్నారు. సభకు లక్షల సంఖ్యలో జనాలను తరలించటానికి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 5గంలకు సభ ప్రారంభంకానుంది. సాయంత్రం 6 గంటల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. గత 17 నెలలుగా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. ఈరోజు సభలో ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి నెలకింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన టార్గెట్‌గా కేసీఆర్ మాట్లాడే అవకాశముంది. రైతాంగ, ప్రజా సమస్యలపై సభలో కేసీఆర్ గళమెత్తనున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఉచ్చరించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వరుస ఓటముల తర్వాత మెదటసారి భారీ సభను కేసీఆర్ నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..
హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..
ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
For More AP News and Telugu News