Begumpet Woman Assistant Pilot: దారుణం.. మహిళా అసిస్టెంట్ పైలట్‌పై అత్యాచారం .!
ABN , Publish Date - Nov 22 , 2025 | 08:51 AM
హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మహిళా అసిస్టెంట్ పైలట్‌పై తోటి పైలట్ అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళా అసిస్టెంట్ పైలట్‌పై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, మహిళా అసిస్టెంట్ పైలట్ ఈ నెల 20వ తేదీన బేగంపేట నుండి పుట్టపర్తి, చెన్నై మీదుగా బెంగళూరు వెళ్లే బిజినెస్ ఫ్లైట్‌లో విధులు నిర్వర్తించింది. సాయంత్రం 4.20 గంటలకు విమానం బెంగళూరుకు చేరుకుంది.
అనంతరం, బాధితురాలు సహా మరో ఇద్దరు పైలెట్లు బెంగళూరులోని ఒక హోటల్లో బస చేశారు. అయితే, అక్కడ ఇద్దరు పైలెట్లతో కలసి బయటికి వెళ్లి హోటల్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అందులోని ఒక పైలెట్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.
హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే బేగంపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. కేసు జరిగిన ప్రదేశం బెంగళూరు పరిధిలోకి రావడంతో బేగంపేట పోలీసులు కేసును అధికారికంగా బెంగళూరు పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడి పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News