Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:23 PM
Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్, జూన్ 18: బేగంపేట ఎయిర్‌పోర్టుకు (Begumpet Airport) బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat) తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఉదయం (బుధవారం) 10:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వగా.. వెంటనే వారు అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలోని ఉద్యోగులందరినీ బయటకు పంపించి బాంబు స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు.
అయితే విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని.. అదంతా ఫేక్ కాల్‌గా బాంబు స్క్వాడ్ గుర్తించింది. కాల్ చేసిన నెంబర్ ఆధారంగా ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సిట్ దూకుడు.. బాధితుల వాంగ్మూలం రికార్డ్
నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం
మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్
Read Latest Telangana News And Telugu News