Hyderabad: కెమెరాతో పైప్‌లైన్ లీకేజీ గుర్తింపు
ABN , Publish Date - Apr 18 , 2025 | 10:58 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. కెమెరాతో పైప్‌లైన్ లీకేజీ గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. నీరు కలుషితం కాకుండా చూడటం, అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూసే క్రమంలో భాగంగా ఈ పద్దతిని ఏర్పాటు చేశారు.

- కలుషిత నీటి సరఫరా సమస్య పరిష్కారం
హైదరాబాద్ సిటీ: పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్ కెమెరా సాయంతో పైపులైన్ లీకేజీని వాటర్‌బోర్డు(Water Board) అధికారులు గుర్తించారు. మరమ్మతులు చేసి కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకున్నారు. రెడ్‌హిల్స్ పరిధిలోని పుత్లీబౌలి చౌరస్తా వద్ద నాలాలోంచి నిర్మించిన 350 ఎంఎం డయా సీఐ ట్రంక్ మెయిన్ పైప్ శిథిలమవడంతో ఆ ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతోందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఎక్కడ లీకేజీ అవుతుందో గుర్తించడం అధికారులకు కష్టమైంది.
ఈ వార్తను కూడా చదవండి: Puppies: మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. అసలేం జరిగిందంటే..
పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్ సాయంతో ట్రంక్ మెయిన్‌లోకి పంపిన కెమెరాతో పైపులైన్ దెబ్బతిన్న ప్రాంతాన్ని గుర్తించారు. లీకేజీ గుర్తించిన ప్రదేశం ప్రధాన రహదారిపై ఉండడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు, అధికారులు సమన్వయంతో మరమ్మతులు చేశారు. మూడు రోజులుగా రాత్రింబవళ్ళు నిరంతరంగా పనులు చేసి కలుషిత నీటి సరఫరా సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బందిని ఎండీ అశోక్ రెడ్డి అభినందించారు.
అపార్ట్‌మెంట్‌లో నల్లాకు ఆరు మోటర్లు
నారాయణగూడ పరిధిలోని పర్దాగేట్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని వాటర్‌బోర్డు విజిలెన్స్ అధికారులు వాట్సా్‌పలో సమాచారం ఇచ్చారు. అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైప్‌లైన్‌కు అక్రమంగా బిగించిన ఆరు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఆరు ఫ్లోర్‌లు ఉండగా.. యజమానులు ఫ్లోర్‌కు ఒకటి చొప్పున ఆరు మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News