Hyderabad: అయ్యప్ప మాల ధరించాడని..
ABN , Publish Date - Oct 31 , 2025 | 07:20 AM
అయ్యప్పమాల ధరించాడని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తరగతులకు అనుమతించలేదు. దీంతో ఏబీవీపీ ప్రతినిధులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళను దిగారు. జీడిమెట్ల పైపులైన్ రోడ్‌లోని షేర్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిహాన్ తేజస్ ఆరో తరగతి చదువుతున్నాడు.
- విద్యార్థిని పాఠశాలకు అనుమతించని యాజమాన్యం
- ఏబీవీపీ ప్రతినిధులు, తల్లిదండ్రుల ఆందోళన
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
హైదరాబాద్: అయ్యప్పమాల ధరించాడని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తరగతులకు అనుమతించలేదు. దీంతో ఏబీవీపీ(ABVP) ప్రతినిధులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళను దిగారు. జీడిమెట్ల పైపులైన్ రోడ్(Jeedimetla Pipeline Road)లోని షేర్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిహాన్ తేజస్(Nihan Tejas) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. తేజస్ ఈనెల 28న పాఠశాలకు పాఠశాలకు వెళ్లగా యాజమాన్యం అనుమతించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

బుధవారం కూడా ఇలానే జరిగింది. గురువారం తల్లిదండ్రులను తీసుకొని పాఠశాలకు వెళ్లగా అనుమతించలేదు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయ, కొంపల్లి నగర కార్యదర్శి పార్ధసారధి, కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్, విద్యార్థి నాయకులతో పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడడంతో విద్యార్థిని తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించారు. ఏబీవీపీ ప్రతినిధులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనను విరమించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News