Share News

Hyderabad Metro: మెట్రో చార్జీలు పెంపు

ABN , Publish Date - May 16 , 2025 | 03:44 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు టికెట్‌ చార్జీలను పెంచారు. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎ్‌ఫసీ) సిఫారసుల ప్ర కారం కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్‌ అండ్‌ టీ సంస్థ గురువా రం తెలిపింది.

Hyderabad Metro: మెట్రో చార్జీలు పెంపు

  • కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు

  • కొత్త ధరలు 17 నుంచి అమలులోకి

  • మెట్రోరైలు చార్జీలను పెంచడం ఇదే తొలిసారి

  • ఎఫ్‌ఎ్‌ఫసీ సిఫారసుల ప్రకారమే..: ఎల్‌ అండ్‌ టీ

హైదరాబాద్‌ సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు టికెట్‌ చార్జీలను పెంచారు. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎ్‌ఫసీ) సిఫారసుల ప్ర కారం కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్‌ అండ్‌ టీ సంస్థ గురువా రం తెలిపింది. పెరిగిన చార్జీలు శనివారం(మే 17) నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మె ట్రో రైలు అందుబాటులోకి వచ్చాక టికెట్‌ ధరలను పెం చడం ఇదే తొలిసారి. కరోనా అప్పుడు మెట్రో ఆదా యం భారీగా పడిపోయింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్ప నతో మెట్రో ఆదాయంపై ప్ర భావం చూపెడుతోంది. రోజుకు రూ. కోటికి పైగా నష్టాలతో మెట్రో నడుపుతున్నామని అధికారులు చాలాకాలంగా చెబుతున్నారు. అయితే, టికెట్‌ ధరల సవరణపై ఎల్‌అండ్‌టీ, మెట్రో, అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వి జ్ఞప్తి మేరకు కేంద్రం 2022 సెప్టెంబరు 5న ఫేర్‌ ఫి క్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎ్‌ఫసీ)ని నియమించింది.


హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఏర్పాటైన ఆ కమిటీ హైదరాబాద్‌లో ప్రజాభిప్రా య సేకరణ చేపట్టి 2023 జనవరి 25న కేంద్రానికి నివేదిక సమర్పించింది. అదే నెలలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలవ్వడంతో చార్జీల పెంపు అంశం మరుగున పడింది. చార్జీల పెంపునకు ఎల్‌ అండ్‌ టీ, మెట్రో అధికారులు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కనపెడుతూ వస్తోంది. చివరికి, నాటి, ఎఫ్‌ఎ్‌ఫసీ కమిటీ సిఫారసుల మేరకే ఇప్పుడు చార్జీలను సవరించారు. మెట్రో రైలు టికెట్‌ ధరల పెంపును లెఫ్ట్‌ పార్టీల నేతలు, ప్రయాణికులు తీ వ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్‌ ధరల పెంపు సామాన్య, మధ్య తరగతి ప్రజల కు భారమని ప్రోగ్రెసివ్‌ యూత్‌ ఫర్‌ లీగ్‌ (పీవైఎల్‌) రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ ప్రదీప్‌, డీవైఎ్‌ఫఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎండీ జావిద్‌ పేర్కొన్నారు.

దూరం కొత్త చార్జీ

(కిమీల్లో) (రూ.ల్లో)

0-2 12

2-4 18

4-6 30

6-9 40

9-12 50

12-15 55

15-18 60

18-21 66

21-24 70

24 పైన 75

Updated Date - May 16 , 2025 | 03:44 AM