Share News

Hyderabad: ఇలంబరిది హెచ్చరిక.. దుర్ఘటనలు జరిగితే.. బాధ్యులు మీరే

ABN , Publish Date - Jul 02 , 2025 | 07:39 AM

ప్రజల భద్రత విషయంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారుల నిర్లక్ష్యాన్ని పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. కాలానుగుణంగా తనిఖీలు, రక్షణా చర్యలు చేపట్టకపోవడం పౌరులకు ప్రమాదకరంగా పరిణమించే ప్రమాదముందని పేర్కొంటూ ఆ శాఖ కార్యదర్శి ఇలంబరిది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Hyderabad: ఇలంబరిది హెచ్చరిక.. దుర్ఘటనలు జరిగితే.. బాధ్యులు మీరే

- ఉదాసీనంగా ఉంటే చర్యలు తప్పవు

- ఇంజనీర్లకు ఇలంబరిది హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ: ప్రజల భద్రత విషయంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారుల నిర్లక్ష్యాన్ని పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. కాలానుగుణంగా తనిఖీలు, రక్షణా చర్యలు చేపట్టకపోవడం పౌరులకు ప్రమాదకరంగా పరిణమించే ప్రమాదముందని పేర్కొంటూ ఆ శాఖ కార్యదర్శి ఇలంబరిది(Secretary Ilambari) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇంజనీర్లు అవసరమైన చర్యలు చేపట్టడం లేదని ఆయన దృష్టికి రావడంతో స్పందించినట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ విభాగానికి పీరియాడికల్‌ పబ్లిక్‌ సేఫ్టీ తనిఖీలపై కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(Commissioner RV Karnan) ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లో కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.


city2.2.jpg

నాలాలు, వరద నీరు నిలిచే ప్రాంతాలను తనిఖీ చేసి అవసరం మేరకు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. పౌరులు విద్యుదాఘాతానికి గురవకుండా వీధి దీపాల స్తంభాలను తప్పనిసరిగా తనిఖీలు చేయించాలని సూచించారు. ఏదైనా దుర్ఘటన జరిగినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నా.. ఏఈఈలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 07:39 AM