Fruit juices: వామ్మో.. పండ్ల రసాలు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 07:09 AM
మీరు బయట జ్యాస్ తాగుతున్నారా.. అయితే ముందుగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నగరంలో కొన్ని జ్యూస్ స్టాళ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమేగాక కుళ్లిన, మెత్తబడిన పండ్లతో జ్యూస్ చేసి ఇస్తున్నారు. ఇది తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు.

- జ్యూస్ షాపుల్లో కుళ్లిన పండ్లు..
- ఫ్రిజ్‌లో పురుగులు
- ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో గుర్తింపు
హైదరాబాద్ సిటీ: వేసవి తాపం భరించలేక బయట షాపుల్లో చల్లటి పండ్ల రసాలు తాగుతున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. కుళ్లిన పండ్లు, వాటిని కోసే కత్తులకు తప్పు, పండ్లను నిల్వ చేసే రిఫ్రిజిరేటర్లలో బొద్దింకలు, పురుగులు, పరిసరాల్లో అపరిశుభ్రత.. ఇది పలు పండ్ల రసాల షాపుల్లోని పరిస్థితి. నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ(సీఎఫ్ఎస్) టాస్క్‌ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వార్తను కూడా చదవండి: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
వెంగళరావునగర్(Vengalraonagar)లోని ఏ-1 ఫ్రూట్ జ్యూస్, అమీర్‌పేట వినట కాంప్లెక్స్‌లోని కోకోనట్ జ్యూస్ బార్, జనరల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న కేజీఎన్, తిరుమల టవర్స్‌లోని నేచురల్ ఫ్లేవర్స్, మెట్రో పిల్లర్ 1443 వద్ద ఉన్న బాంబే జ్యూస్ సెంటర్లను అధికారులు తనిఖీ చేశారు.
కొన్నిచోట్ల కుళ్లిన పండ్లు, కాలం చెల్లిన ఫ్రూట్ సిర్‌పలు, ఉత్పిత్తిదారు(మ్యానుఫ్యాక్చరర్), తేదీల వంటి వివరాలు లేని సోడా సీసాలు వాడుతున్నారని, నీరు కూడా స్వచ్ఛమైనవి వాడడం లేదని, సిబ్బంది యాప్రాన్, హెడ్ క్యాప్ ధరించడం లేదని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పండ్ల రసాల విక్రయ కేంద్రాలకు, ప్రమాణాలు పాటించని వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News