Share News

CP VC Sajjanar: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు..

ABN , Publish Date - Nov 29 , 2025 | 08:18 AM

పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు.. అంటూ సిబ్బందికి సిటీ పొలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌ హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే అసాంఘిక శక్తులు పెరిగిపోతాయని, పోలీసులు ప్రతిక్షణం అలెర్ట్‏గా ఉండాలని ఆయన సూచించారు.

CP VC Sajjanar: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు..

- కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌

- క్రైం రివ్యూ మీటింగ్‌లో సీపీ వీసీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదుపై తక్షణం స్పందించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని సిబ్బందికి నగర సీపీ వీసీ సజ్జనార్‌(City CP VC Sajjanar) తెలిపారు. కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిషనరేట్‌లో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు.


city4.2.jpg

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. డ్రగ్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై ఉక్కుపాదం మోపాలన్నారు. అలాగే సైబర్‌ క్రైమ్‌, మహిళా భద్రత, స్ట్రీట్‌ క్రైమ్‌, ఆహార కల్తీ కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషన్‌ సీపీ శ్రీనివాసులు, డీసీపీలు అపూర్వారావు, శ్వేత, రక్షిత మూర్తి, రష్మి పెరుమాళ్‌, శిల్పవల్లి, రూపేష్‌, కిరణ్‌ ప్రభాకర్‌, బాలస్వామి, చంద్రమోహన్‌, సీహెచ్‌ శ్రీనివాస్‌, అరవింద బాబు, లావణ్యనాయక్‌ జాదవ్‌లతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజీ వెనుక రహస్యమేంటో?

అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2025 | 08:18 AM