CV Anand: నగరం చుట్టూ చెక్‌పోస్టులు..
ABN , Publish Date - May 23 , 2025 | 07:02 AM
హైదరాబాద్ నగరం చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా జంతువులను తరలిస్తున్న వారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ, పోలీస్ అధికారుల బృందాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.

- పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: నగరం చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ సీవీ ఆనంద్(City CP CV Anand) హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. గురువారం కమాండ్ కంట్రోల్ రూములోని కమిషనర్ కార్యాలయంలో బక్రీద్ పండగ ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా జంతువులను తరలిస్తున్న వారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ, పోలీస్ అధికారుల బృందాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా జంతువులు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు జంతువులను గోశాలలకు తరలించాలని తెలిపారు.
తనిఖీలు చట్టపరమైన అధికారులే చేయాలని, ప్రజలు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని సూచించారు. జంతు కళేబరాలను సేకరించేందుకు ప్రతి ఇంటికి కవర్లు సరఫరా చేయాలని, పండుగ రోజు చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ కణ్ణన్(GHMC Commissioner Kannan) మాట్లాడుతూ..
వార్డులు, మసీదుల వద్ద అదనపు పారిశుధ్య సిబ్బందిని, చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు చెత్త సంచులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమన్వయ సమావేశంలో అదనపు సీపీ విక్రం సింగ్‌మాన్, ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్, హెల్త్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ సీహెచ్ మల్లేశ్వరితో పాటు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News