Hyderabad: జూనియర్ ఎన్టీఆర్ ఫొటో మార్ఫింగ్‌పై ఫిర్యాదు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:24 AM
జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి, నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి విన్నవించారు.
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీకి వినతి
హైదరాబాద్ సిటీ: జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ఫొటోను మార్ఫింగ్ చేసి, నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి(Nandipati Murali) విన్నవించారు. బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Hyderabad Police Commissioner Sajjanar)కు ఫిర్యాదు చేశారు.

సదరు వ్యక్తులపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. బాధ్యులపై సీపీ సజ్జనార్(CP Sajjanar).. కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అసభ్యకర ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News