Share News

Hyderabad: ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌..

ABN , Publish Date - Feb 01 , 2025 | 07:46 AM

ప్రపంచం పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి చెందుతున్నదని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Hyderabad: ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌..

- మౌలిక సదుపాయాల పెట్టుబడులతో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి

- నారెడ్కో సమ్మిట్‌లో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: ప్రపంచం పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి చెందుతున్నదని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Speaker Gaddam Prasad Kumar, Minister Uttam Kumar Reddy) అన్నారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నారెడ్కో)ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌- 2025 హైటెక్‌ సిటీలో గురువారం రాత్రి నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: కుంభమేళా నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..


కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్థి చెందుతోందని, ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయలు, అభివృద్ధి ప్రాజెక్టులతో నగరం పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల వరకు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో మెట్రో రైలు విస్తరణ, ప్యుచర్‌ సిటీ, ప్రపంచ స్థాయి స్కిల్‌, స్పోర్ట్స్‌ వర్సిటీలు వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్‌ ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా మారుతుందని, దావో్‌సలో రూ.1.78లక్షల కోట్ల పెట్టుబడులు సేకరించడం వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి, రియల్‌ ఎస్టేట్‌ వృద్ధిని ప్రోత్సహించడానికి దోహదపడుతుందన్నారు.


city3.2.jpg

రియల్‌ ఎస్టేట్‌ రంగం, నిర్మాణ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ మాట్లాడుతూ.. భూ భారతితో రెవెన్యూ సమస్యలు తీరతాయన్నారు. రియల్టర్లు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేశారు. సీఎం ఓఎస్డీ వి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఫ్రీలాంచ్‌ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి మేక, ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్‌రెడ్డి, ప్రముఖ నటుడు మురళీమోహన్‌, డెవలపర్లు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 07:46 AM