Nagaram Land Dispute: కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అటకెక్కిస్తే ఏంచేస్తారు
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:22 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని వివాదాస్పద భూముల వ్యవహారంపై

నాగారం భూములపై పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్న.. తీర్పు రిజర్వ్
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి):రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని వివాదాస్పద భూముల వ్యవహారంపై విచారణ కమిషన్‌ను నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిటిషన్‌లో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులు మార్చి పలువురు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు నాగారంలో భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. దీనిపై విచారణ కమిషన్ వేసేలా ఆదేశించాలని వడిత్య రాములు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీర్ల మల్లేశ్ వేర్వే రు పిటిషన్లల వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ రాములు తరఫున న్యాయవాది విజయలక్ష్మి వాదిస్తూ.. హైప్రొఫైల్ బ్యూరోక్రాట్లు ఉన్న ఈ వ్యవహారంపై విచారణ కమిషన్‌ను వేస్తే గానీ నిజానిజాలు బటయకు రావన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘హైప్రొఫైల్ అధికారులు ఉన్నారంటున్నారు. వీరే ప్రభుత్వంలో ఉంటారు కదా? ఎంక్వైరీ కమిషన్ ఇచ్చే నివేదికపై చర్యలు తీసుకోకుండా.. ప్రభుత్వం అటకమీద పెడితే ఏం చేస్తారు?’అని ప్రశ్నించింది. విచారణ కమిషన్ వేయాలని దాఖలైన పిటిషన్‌లో తీర్పు రిజ ర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. బీర్ల మల్లేశ్ పిటిషన్‌లో దాఖలైన ఐదు మధ్యంతర అప్లికేషన్‌లపైనా తీర్పును రిజర్వు చేస్తున్నట్లు స్పష్టంచేసింది. బీర్లమల్లేశ్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News