Telangana: వడదెబ్బకు 11 మంది మృత్యువాత
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:27 AM
తెలంగాణలో తీవ్ర ఎండల ధాటికి 11 మంది వడదెబ్బకు మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఈ సీజన్‌లోనే అత్యధికంగా నమోదైంది.

తెలంగాణలో భానుడి ఉగ్రరూపం
నిర్మల్ జిల్లా కుభీర్‌లో 45.2 డిగ్రీలు
ఈ సీజన్‌లో ఇదే అత్యధికం..
ములుగు జిల్లాలో వర్ష బీభత్సం
నేడు, రేపు వడగాలులు, వానలు!
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన వారున్నారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని కుభీర్‌లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం.. అదే జిల్లా దస్తూరాబాద్, పెంబి, నర్సాపూర్(జి), కడెం, మంచిర్యాల జిల్లా కోటపల్లి, భీమినిలో 45 డిగ్రీల చొప్పున రికార్డయింది. దీంతో భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కల్లూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన మహిళా రైతు నారుమళ్ల చంద్రకళ (46), అదే మండలంలోని చిన్నకోరుకొండిలో వ్యవసాయ కూలీ పి.రామగురు(45), మధిర రామనాధం వీధిలో వజ్రాల శేషాచారి (80) వడదెబ్బకు అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. పెద్దపల్లి జిల్లా యైుటింక్లయిన్‌కాలనీకి చెందిన లారీ డ్రైవర్ పుల్లూరి రమేశ్(37), ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లోని ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా విధులు నిర్వహిస్తున్న కన్నక కాశీరాం(42)వడదెబ్బకు మృతి చెందారు.
సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఉపాధి కూలీ కొడారు కోటయ్య (62), నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్టకు చెందిన మత్స్య కార్మికుడు బెస్త గంగారాం (55), కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన కల్లెం రమేశ్ (55) ఎండల ధాటికి అస్వస్థతకు గురై మరణించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో వ్యవసాయ కూలీ నాంపెల్లి రవళి (35), జనగామజిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికురాలు పులి రమ(50), ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లిలో పశువుల కాపరి తాళ్ల సాంబయ్య (65) వడదెబ్బకు మృతి చెందారు. కాగా, బుధవారం నిర్మల్ జిల్లాలోని కుభీర్‌లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం.. అదే జిల్లా దస్తూరాబాద్, పెంబి, నర్సాపూర్(జి), కడెం, మంచిర్యాల జిల్లా కోటపల్లి, భీమినిలో 45 డిగ్రీల చొప్పున రికార్డయింది. దీంతో ఆయా మండలాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి, మంచిర్యాల జిల్లా నెన్నెల, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లో 44.9డిగ్రీల చొప్పున నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో 4,117 మెగావాట్లకు పెరిగింది. కాగా, ములుగు జిల్లా వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. వాజేడు మండలంలోని చింతూరు పంచాయతీలోని ఆర్లగూడెంలో 20 ఎకరాల్లో మిర్చి పంట నాశనమైంది. ఏటూరునాగారం మండలంలో 350 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.
రెండ్రోజులు వడగాడ్పులు.. వర్షాలు!
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు వీస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, మహబూబాబ్‌నగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest Telangana News And Telugu News